మాగనూర్ (కృష్ణా): ట్రాక్టర్‌ను బైక్‌తో వెనుక నుంచి ఢీకొని సుభాష్ (50) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడెబాల్లూర్ గ్రామంలోని జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగింది. కృష్ణ ఎస్‌ఐ నవీద్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం శక్తినగర్‌కు చెందిన సుభాన్ భార్యాపిల్లలతో కలిసి ఉట్కూర్ మండలం చిన్నపొర్లలో నివాసముంటున్నాడు. మక్తల్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పని నిమిత్తం శుక్రవారం ఉద యం శక్తినగర్‌కు వెళ్లి తిరిగి మక్తల్‌కు వస్తున్న సమయంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
నవాబుపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని మొరంబావి సమీ పంలో చోటుచేసుకుంది. మండలంలోని కొల్లూర్‌కు చెందిన వడ్ల అభిలాష్(21) శుక్రవారం మండల కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై కొల్లూర్‌కు వెళ్తుండగా మొరంబావి సమీపంలో అక స్మాత్తుగా జేసీబీ ఎదురు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అబిలాష్ తీవ్రగాయాలతో ఉండగా.. 108వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై ఇంకా పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది.
చోరీ కేసులో
ముగ్గురికి రిమాండ్
ఖిల్లాఘనపురం: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పట్టుకొని న్యా యమూర్తి ముందు హాజరు పరచగా వారికి రిమాండ్ విధించిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 5న మానాజీపేట రోడ్డు వైపు నుంచి మండలంలోని సోళీపురం గ్రామానికి చెందిన కావలి శివుడు అలియాస్ దిల్లి, మానాజీపేటకు చెందిన లెంకల మల్లేష్ బైక్‌పై మేకను తీసుకుని వెళ్తుండగా పోలీసులు ఆపి వివరాలు అడిగారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. మేకను దొంతికుంట తండాలో దొంగిలించి అమ్ముకోవడానికి వెళ్తున్నట్లు ఒప్పుకొన్నారు. ఇదే సమయంలో రెండు మూ డు నెలలుగా ఇద్దరూ కలిసి దొంతికుంట తండాలోని ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో వారి నుంచి 49 తులాల వెండి, 3 గ్రాముల బంగారం, 3 మేకలు, గొర్రె, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి సహకరించిన కావలి శివుడు తల్లి లలితను కూడా అదుపులోకి తీసుకొని గురువారం రాత్రి వనపర్తి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ క్రమంలో దొంగతనం కేసును చేధించిన సిబ్బంది లింగం, రాజు, రమేష్, రవి, చైతన్య కుమార్, తేజశ్రీ లను ఎస్‌ఐ వెంకటేశ్ అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
విజేతలుగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో శనివారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లు శుక్రవారం తరలివెళ్లాయి. ఉమ్మడి జిల్లా జట్లను వేణుగోపాల్ అభినందించారు. విద్యార్థులు పట్టుదల, సమష్టిగా ఆడితే క్రీడల్లో విజయాలు సాధించవచ్చని అన్నారు. జిల్లా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బాల్‌రాజు, ఇలియాజ్, సుబాన్‌జీ, ముకర్రం, ఉస్మాన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని మృతిపై కేసు నమోదు
వనపర్తి రూరల్: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని బీ టెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గత మంగళవారం చోటుచేసు కుంది. ఎస్‌ఐ హృశికేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దగూడెంకు చెందిన చిన్నపాగ వైష్ణవి (19) రంగారెడ్డి జిల్లాలోని జేబీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే కళాశాల లెక్చరర్ ఉపేందర్ రావు, వైష్ణవిని ఇటీవల వ్యక్తిగతంగా తిట్టడంతో మానసిక ఒత్తిడికి లోనై ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుమార్తె ఆత్మహత్యపై తల్లి పద్మావతి శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


