మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో బుక్స్ ఎగ్జిబిషన్ రెండోరోజు కొననసాగింది. ఈ మేరకు పలు డిపార్ట్‌మెంట్‌ల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైబ్రరీ కోఆర్డినేటర్ జయనాయక్ మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడంతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అవకాశం ఉదని, ప్రదర్శనలో డైలీ పేపర్‌లు మ్యాగజైన్‌లు, పరిశోధనతోపాటు అ న్ని పోటీ పరీక్షలకు పుస్తకాలు అందుబాటులో ఉ న్నాయని, విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పుస్తకాలు చదివితే పోటీ ప రీక్షల్లో సులువుగా రాణించవచ్చిని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టచ్ సంస్థను సందర్శించిన విద్యార్థులు
పీయూ ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని టచ్ సంస్థను సందర్శించారు. ఈమేరకు అక్కడ విద్యార్థులకు సంస్థ కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు విద్య వంటి అంశాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు గాలెన్న, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.


