బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం

Nov 7 2026 12:54 AM | Updated on Nov 7 2026 12:54 AM

● కురుమూర్తి బ్రహ్మోత్సవాల

ఏర్పాట్లపై సమీక్ష

● హాజరైన కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి

చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను అత్యంత వైభవవగా జరుపుకొందా మని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా వివిధ శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మో త్సవాలు, జాతరపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆలయానికి చేరుకునే రోడ్ల మరమ్మతు, తాగునీటి వసతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ సమస్య, పోలీస్‌ భద్రతా ఏర్పాట్లు తదితర వాటిపై చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలోనే కురుమూర్తిస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. బ్రహ్మోత్సవాల్లో అందరం భాగ్యస్వాములు కావడం స్వామివారు కల్పించిన మంచి అవకాశమన్నారు. అందరి సమన్వయంతో ఉత్సవాలు ఈ సంవత్సరం ప్రశాంతంగా నిర్వహించుకుందామన్నారు. ముఖ్యంగా స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పా ట్లు చేయాలన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం, భద్ర తా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ సమస్య తదితర వాటిపై ప త్యేక దృష్టిసారించాలన్నారు. అవసరమైనన్న తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు,స్నానపు గదులు ఏర్పా టు చేయాలన్నారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు.

సామాన్య భక్తులకే పాధాన్యం

కురుమూర్తి స్వామి పల్లె ప్రజల ఆరాధ్య దైవమని అందుకు స్వామివారి దర్శనంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం కల్పిస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తే సహించబోమన్నారు. ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా జాతర ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసే విధంగా సిబ్బందిని నియమించాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తినట్లైతే వెంటనే కంట్రోల్‌ రూంకు తెలియ జేయాలన్నారు. ముఖ్యంగా జాతరలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. భక్తులకు చికిత్సతోపాటు అందుబాటులో అంబులెన్స్‌లను ఉంచాలని వైద్యసిబ్బందికి సూచించారు. భక్తులు తరలివచ్చే రహదారులన్నీ మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ముళ్లపొదలను తొలగించి ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే రోడ్లపై రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటారని వాటితో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంటుందని వాటిని అరికట్టాలన్నారు. జాతర ప్రాంతంతోపాటు జాతర చుట్టుపక్కల గ్రామాల్లో మద్యం విక్రయాలు కొనసాగించకుండా తగు చర్యలు చేపట్టాలని ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్‌ అంతరాయం కలుగకుండ తగు జాగ్రతలు తీసుకోవాలని విద్యుత్‌ అధికారులకు ఆదేశించారు. విద్యుత్‌ సరఫారాలో అజాగ్రత వాహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అంతకు ముందు ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన దాసంఘాల షెడ్డు, రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ప్రాంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్‌ భక్తుల బాల్‌రాజు, అమ్మపురం సర్పంచ్‌ రంజిత్‌తోపాటు పలువురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement