● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
అలంపూర్ : టైర్ పేలడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన అలంపూర్ చౌరస్తాలోని ఫ్లైఓవర్‌పై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీఆర్ఎల్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అలంపూర్ చౌరస్తాకు రాగానే బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అనంతరం బస్సు హైదరబాదు నుంచి కర్నూల్ మార్గంలోకి దూసుకొచ్చి ఆగిపోయింది. ఫ్లైఓవర్ సైడ్ వాల్స్‌కు సమీపంలోనే ఆగిపోయి ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటికి వచ్చారు. అయితే ఈ ప్రమాదంతో ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మిదేవి అనే ఒక ప్రయాణికురాలు ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒస్సు ఒక మార్గం నుంచి వేరే మార్గంలోకి వెళ్లి నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో రాకపోకలు కొనసాగాయి.


