మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 విభాగం బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లా బాలికల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో గద్వాల జట్టు 4–1 గోల్స్ తేడాతో నాగర్‌కర్నూల్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. అనంతరం విన్నర్, రన్నరప్ జట్లకు పెటాటీఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, ప్రభుత్వ బీఈడీ కళాశాల పీడీ వడెన్న, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ తదితరులు ట్రోఫీలు అందజేశారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెంకట్రాములు, నరేష్, ప్రకాశ్, రామకృష్ణ, ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.


