గణితంపై ఆసక్తి పెరిగింది | - | Sakshi
Sakshi News home page

గణితంపై ఆసక్తి పెరిగింది

Nov 1 2026 7:07 AM | Updated on Nov 1 2026 7:07 AM

సాక్షి మ్యాథ్స్‌ బి పోటీల్లో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీ ద్వారా గణితంపై ఆసక్తి పెరగడంతోపాటు లెక్కలను వేగంగా, కచ్చితంగా చేయటం నేర్చుకున్నాం. ఇలాంటి పోటీల్లో పాల్గొనేలా చేసినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు.

– వీరా, 1వ తరగతి, మౌంట్‌బాసిల్‌ స్కూల్‌.

ఆలోచన శక్తి

మ్యాథ్స్‌ బి పోటీతో మా తార్కి ఆలోచనా శక్తి (లాజికల్‌ థింకింగ్‌) మెరుగుపడింది. అలాగే సమస్యలను పరిష్కరించే నైపుణ్యం తెలిసి వచ్చింది. గణితం అంటే భయం కాకుండా ఆసక్తి కలిగించే విషయమని తెలుసుకున్నాం.

– శ్రావణి, 7వ తరగతి, మౌంట్‌బాసిల్‌ స్కూల్‌.

ఆత్మవిశ్వాసం పెరిగింది

సాక్షి మ్యాథ్స్‌ బి పోటీల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలాంటి పోటీ లు మాలో చదువుపై మరింత శ్రద్ధ పెంపొందిస్తుందనటంలో నిస్సందేహం. మ్యాథ్స్‌ బి లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన పాఠశాల, సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు.

– తరుణ్‌, 3వ దీక్ష, మౌంట్‌బాసిల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement