నైపుణ్యాలకు పునాది.. భవిష్యత్‌కు బాట | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలకు పునాది.. భవిష్యత్‌కు బాట

Nov 1 2026 5:01 AM | Updated on Nov 1 2026 5:01 AM

● ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ రెడీనెస్‌’ కార్యక్రమం ప్రారంభం

● కలెక్టర్‌ ఖుష్బూగుప్తా చేతుల మీదుగా ప్రోగ్రాం ఆవిష్కరణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ రెడీనెస్‌ ప్రోగ్రామ్‌’ను కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ప్రారంభించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రోగ్రామ్‌కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక, సామాజిక, ఉద్యోగ రంగాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మార్కులే కాకుండా కమ్యూనికేషన్‌, ఆర్థిక అక్షరాస్యత, సమస్యల పరిష్కారం, విమర్శ నాత్మక ఆలోచన, కెరీర్‌ ప్రణాళిక వంటి నైపుణ్యాలు భవిష్యత్‌లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. డీఈఓ విజయకుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లోని అంతర్గత ప్రతిభను వెలికితీసేందుకు ఇది వేదికగా నిలుస్తుందని తెలిపారు.

నాలుగు

విభాగాల్లో శిక్షణ

జిల్లాలోని 9 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 15 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మరో 2 ప్రభుత్వ పాఠశాలలు కలిపి మొత్తం 26 పాఠశాలల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందులో నాలుగు ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ‘యంగ్‌ ఒరేటర్స్‌ క్లబ్‌’ ద్వారా ఆంగ్ల సంభాషణ, వేదికపై ప్రసంగం, భావ వ్యక్తీకరణ; ‘థింక్‌ అండ్‌ మేక్‌’ ద్వారా సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తారు. ‘స్వతః’తో పాటు ‘ఫ్యూచర్‌ డాట్స్‌’ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధి, 9, 10వ తరగతుల వారికి వృత్తులు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, కెరీర్‌ ప్రణాళికపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్‌, డీఎస్‌ఓ షంషీర్‌, జీసీడీఓ అస్రా ఖాద్రి, ఎంఈఓ ఉషారాణితో పాటు హెచ్‌ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement