స్పెల్‌ బీకి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

స్పెల్‌ బీకి విశేష స్పందన

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

● ‘సాక్షి’ ఆధ్వర్యంలో మౌంట్‌ బాసిల్‌, కేపీఎస్‌ పాఠశాలలో నిర్వహణ

● హాజరైన 133 మంది విద్యార్థులు

జడ్చర్ల టౌన్‌/ కొత్తకోట రూరల్‌: ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్‌ బీ, మ్యాథ్స్‌ బీ, చేతిరాత పోటీలకు విశేష స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని మౌంట్‌ బాసిల్‌ స్కూల్‌లో 64 మంది, వనపర్తి జిల్లా కొత్తకోటలోని కేపీఎస్‌ పాఠశాలలో 69 మంది కలిపి మొత్తం 134 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఆయా పాఠశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. విద్యార్థులలో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన పోటీలకు 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొని పదాల కూర్పు, ఉచ్ఛారణలో విద్యార్థులు తమలోని ప్రతిభచాటారు. మౌంట్‌బాసిల్‌లో గైడ్‌ ఉపాధ్యాయురాలు సాయి ప్రణీత పర్యవేక్షణలో చైర్మన్‌ చంద్రకళ వెంకటయ్య, డైరెక్టర్లు శిరీష ప్రవీణ్‌, పూజిత మోహన్‌రెడ్డి, సుశాంత్‌ కృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోటీలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement