భర్త మృతిని తట్టుకోలేక భార్య.. | - | Sakshi
Sakshi News home page

భర్త మృతిని తట్టుకోలేక భార్య..

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

వీపనగండ్ల: భర్త రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి భార్య మృతి చెందిన విషాదకర ఘటన మండలంలోని పుల్గర్‌చర్లలో చోటుచేసుకుంది. పుల్గర్‌చర్లకు చెందిన చాకలి నిరంజన్‌ బుధవారం గుండెపోటుతో మరణించగా.. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అదే రాత్రి భార్య కూడా తీవ్ర అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా శుక్రవారం మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

తాడూరు: 15 నెలల చిన్నారి బాత్రూంలోని నీటి బకెట్‌లో పడి మృతి చెందిన విషాద ఘటన నాగర్‌కర్నూల్‌ మండలం ఎండ్లబెట్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగయ్య, శివలీల దంపతుల కుమారుడు లోకేష్‌ (చిన్ను) ఇంటి ముందు ఆడుకుంటూ బాత్రూంలోని బకెట్‌ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయాడు. కుంటంబ సభ్యులు గమనించి బయటకు తీసి వెంటనే జిల్లా జనరల్‌ ఆస్పత్రిక తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement