మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఫార్మసీ విద్యార్థుల పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఫార్మసీ చదివిన విద్యార్థులకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రొఫెసర్ సునీత, ప్రిన్సిపాల్ ఈశ్వర్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, తరుణ్, సైలస్, సోమేశ్వర్, చిన్నాదేవి, రవికాంత్ పాల్గొన్నారు.
క్రీడా పోటీలు ప్రారంభం
సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్, టెబుల్ టెన్సిస్ పోటీలకు పీయూలో ఎంపికలు జరిగాయి. ఈమేరకు వీసీ శ్రీనివాస్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి యూనివర్సిటీ గోల్డ్‌మెడల్ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


