మల్దకల్: రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం మండలంలోని శేషంపల్లి స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన మహేష్, కిరణ్ తమ సొంత పనుల నిమిత్తం బైక్‌పై గద్వాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జూపాడుకు చెందిన లోకేష్, ఏసన్న, రవికుమార్ తాటికుంట స్టేజీ నుంచి నీలిపల్లికి బైక్‌పై వస్తున్న క్రమంలో మోటారుసైకిల్ బస్సును ఓవర్టేక్ చేసి వెళ్లే క్రమంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో చిన్నతాండ్రపాడు చెందిన మహేష్ (23), కర్నూలు జిల్లా జూపాడుకు చెందిన లోకేష్ (25) మృతి చెందారు. అలాగే కిరణ్, ఏసన్నలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108లో గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రవికుమార్ గద్వాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహేష్‌కు ఏడు నెలల క్రితమే వివాహమైంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీహరి తెలిపారు.
ప్రైవేట్ ఉద్యోగి..
జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై ఎలక్ట్రిక్ స్కూటీని ఎదురుగా వచ్చిన తుఫాన్ వాహనం అతివేగంగా ఢీకొట్టగా బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఖాదర్ కథనం మేరకు.. మాచారం గ్రామానికి చెందిన నాయినోళ్ల నరేష్‌గౌడ్ (26) పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో గల ఎన్ఐఎంఎంఎస్ యూనివర్సిటీలో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు లాగానే ఇంటి నుంచి తన స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన తుఫాన్ వాహనం ఢీకొట్టగా.. నరేష్‌గౌడ్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి నర్సింహులుగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


