● ఎకరాకు రూ.25 వేల
నష్టపరిహారం చెల్లించాలి
● రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ రూరల్: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని మాచన్‌పల్లిలో ఎండిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులకు పంట చేతికందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, మిగిలిన పంటలను కాపాడేందుకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరారు. గతంలో రూ.381 కోట్లతో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, స్తంభాలు ఏర్పాటు చేసినా ప్రస్తుతం సక్రమంగా విద్యుత్ అందడం లేదన్నారు. పశుగ్రాసాన్ని సబ్సిడీపై పంపిణీ చేయడంతో పాటు సాగునీటి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా టెండర్లు రద్దు చేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణలో పాలమూరు ప్రాంతానికి అన్యా యం జరుగుతోందన్నారు. చెరువులకు నీళ్లు అంద ని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పంటలు వేయవద్దని సూచించిన ప్రభుత్వం రైతులకు రైతుబంధుతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక స హాయం అందించాలని కోరారు. వ్యవసాయ కూలీలకు ఎన్నికల హామీ మేరకు చెల్లించాల్సిన రూ.36 వేల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బి.రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, సర్పంచ్ గచ్చుమాలె వెంకటయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


