పల్లెల్లో న్యాయ అవగాహన పెరగాలి | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో న్యాయ అవగాహన పెరగాలి

Nov 1 2026 5:01 AM | Updated on Nov 1 2026 5:01 AM

పాలమూరు: గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చట్టాలపై న్యాయ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. కోయిలకొండ మండలం అయ్యవారిపల్లిలో నెల రోజులుగా నిర్వహిస్తున్న నాల్సా పథకాల మెగా డ్రైవ్‌ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి నెల రోజులుగా న్యాయ సేవా అధికార సంస్థ చేసిన కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయ సేవా అధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ తర్వాత అర్హులైన వారికి కార్మికశాఖ కార్డులు, మెగా డ్రైవ్‌లో పాల్గొన్న పారా లీగల్‌ వలంటీర్లకు సర్టిఫికెట్స్‌ అందించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, ఎంపీడీఓ ధనుంజయ్‌గౌడ్‌, తహసీల్దార్‌ దీపక్‌రావు, ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.

పోలీసులు, ప్రాసిక్యూషన్‌ సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ

మహబూబ్‌నగర్‌ క్రైం: కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారంతో పాటు నేర నిరూపణ జరిగేలా పోలీసులు, ప్రాసిక్యూషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ డి.జానకి సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ, లైజన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ కేసుల పరిష్కారం, సాక్షుల హాజరు, పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి కేసు పురోగతి, తదుపరి విచారణ తేదీ, సమన్లు, వారెంట్ల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సాక్షులు, దర్యాప్తు అధికారులు సకాలంలో కోర్టులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోక్సో, మహిళలకు సంబంధించిన కేసులు, తీవ్రమైన నేరాల విచారణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నాణ్యమైన దర్యాప్తు, పటిష్టమైన ఆధారాలతో నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

పత్తి క్వింటా రూ.9,019

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పత్తి క్వింటా గరిష్టంగా రూ.9,019, కనిష్టంగా రూ.8,579 ధర పలికింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకం గరిష్టంగా రూ.3,689, కనిష్టంగా రూ.2,865, మొక్కజొన్న గరిష్టంగా రూ.3,257, కనిష్టంగా రూ.1,851, ఆముదాలు రూ.7,889 ధరలు లభించాయి.అలాగే దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం గరిష్టంగా రూ.3,551, కనిష్టంగా రూ.2,500, కేఎన్‌ఎమ్‌ ధాన్యం ధర గరిష్టంగా రూ.3,319, కనిష్టంగా రూ. 2,750 గా ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement