రూ.25 కోట్ల డీడీ ఇచ్చి సీఎంకు లేఖ రాయి | - | Sakshi
Sakshi News home page

రూ.25 కోట్ల డీడీ ఇచ్చి సీఎంకు లేఖ రాయి

Nov 1 2026 7:07 AM | Updated on Nov 1 2026 7:07 AM

జడ్చర్ల: అరకొర కొర్రీలు పెట్టి తప్పించుకునే విధంగా మాట్లాడొద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సూచించారు. శనివారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముందుగా రూ.25 కోట్లు డీడీ తీసి సీఎంకు లేఖ రాయాలని సూచించారు. ఒరిజనల్‌ డీడీ మీ వద్దనే ఉంచుకుని.. తమకు జిరాక్స్‌ ఇస్తే చాలన్నారు. జీఓ వచ్చిన తర్వాతనే ఒరిజనల్‌ డీడీ ద్వారా ఆస్పత్రి నిర్మాణం చేయవచ్చన్నారు. ఇక తన భార్య పేరున కొనుగోలు చేసిన భూమిపై కూడా లక్ష్మారెడ్డి కన్ను పడిందన్నారు. లోన్‌ తీసుకుని పక్కాగా పట్టా భూమిని కొనుగోలు చేశామన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చేసిన భూదందాలు చాలవా అంటూ ప్రశ్నించారు. తనకు టికెట్‌ రాని ఒత్తిడిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న లక్ష్మారెడ్డిని తాను కలిసిన మాట వాస్తవమేనని.. తర్వాత మల్లురవి తన వద్దకు వచ్చి నచ్చజెప్పడంతో మనసు మార్చుకుని మల్లురవి గెలుపునకు కృషి చేశామన్నారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు కృషి చేయకుండా బీజేపీ అభ్యర్థి గెలుపునకు పని చేశారా లేదా అని మాజీ మంత్రిని ప్రశ్నించారు. తనకు 2014లో జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌ పదువులు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినా.. తాను బీఆర్‌ఎస్‌లో చేరలేదన్నారు.

● కొర్రీలు పెట్టి తప్పించుకోవద్దంటూ హితవు

● ఒరిజినల్‌ డీడీ మీ వద్దే ఉంచుకుని జిరాక్స్‌ ఇస్తే చాలు..

● మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సూచన

● నిన్ను కలిసిన మాట వాస్తవమే.. కానీ మల్లు రవి గెలుపు కోసమే కృషి చేశా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement