మహమ్మదాబాద్: రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ నెలరోజుల తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని నంచర్లకు చెందిన గడ్డమీది రమేష్(25) పోలీసు శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గతనెలలో గణేశ్ నిమ్జనంలో భాగంగా ఆయన మహబూబ్‌నగర్‌లో విధులు నిర్వహించాడు. అనంతరం ఉదయం తిరిగి బైకుపై వస్తుండగా ప్రమాదవశాత్తు పిల్లిగుండు వద్ద బొలేరో ఢీకొన్నది. అక్కడే తలకు తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేర్చారు. రూ.30లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు మృత్యువుతో పోరాడుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకునే కుమారుడు మృతిచెందిన వార్త తట్టుకోలేక తల్లి రోధదనలు మిన్నంటాయి. దీంతో నంచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.


