క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు రెండింటిని సమానంగా స్వీకరించాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన పది ఉమ్మడి జిల్లాల రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు కప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీ డాకారులు గద్వాల జిల్లాకు వచ్చి ఆడటం చా లా సంతోషించదగ్గ విషయమని చెప్పారు. కా ర్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసు లు, పరిశీలకుడు డేవిడ్సన్, పీఈటీలు బీసన్న, రజనీకాంత్, హైమావతి, మోహన్ మురళీ, నగేష్‌బాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.


