జూరాలకు వెయ్యి క్యూసెక్కుల వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు వెయ్యి క్యూసెక్కుల వరద

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నాలుగురోజులలుగా స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుకుంటుంది. సగటున 600 క్యూసెక్కుల నీటి నుంచి క్రమంగా 1000 క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తున్నట్లు ఏఈ సుదర్శన్‌ తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్‌ డ్యాం నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 3.280 టీఎంసీల నీటిమట్టం ఉంది. జూరాల ఆయకట్టుకు వారా బందీ ద్వారా సాగునీటిని వదులుతున్న ప్రాజెక్టు అధికారులు ఈసారి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుకుంటేనే నవంబర్‌ చివరి నాటిని సాగునీటిని అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎగువ నుంచి వరదనీరు రాకపోవడంతో ఈనెల 31నుంచి 4రోజులపాటు చివరి తడిగా సాగునీటిని ఆయకట్టుకు విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement