మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం మహబూబ్నగర్ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు డివిజన్ స్థాయి క్రీడల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ అంశాల్లో పోటీ లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి ఛత్రునాయక్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


