రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ విజేత ఖమ్మం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ విజేత ఖమ్మం

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

గద్వాల న్యూటౌన్‌: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన 70వ రాష్ట్రస్థాయి బాలుర అండర్‌–17 క్రికెట్‌ టోర్నీ విజేతగా ఖమ్మం నిలిచింది. గురువారం సాయంత్రం ఆసక్తికరంగా రంగారెడ్డితో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఖమ్మం జట్టు ఉమ్మడిగా రాణించి 62 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. సెమీఫైనల్స్‌లో మహబూబ్‌నగర్‌, మెదక్‌ ఓటమి చెందాయి. మూడో స్థానంలో మెదక్‌ నిలిచింది.

ఉత్కంఠభరితంగా..

ఇండోర్‌ స్టేడియంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. ఫైనల్‌ బెర్త్‌ కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెమీస్‌ మహబూబ్‌నగర్‌– రంగారెడ్టి జట్ల మధ్య జరగగా.. 3 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ నిర్ణీత 12 ఓవర్లలో 7 వికెట్లకు 88 పరుగులు చేయగా 7 వికెట్లు కోల్పోయి రంగారెడ్డి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో సెమీస్‌లో ఖమ్మం– మెదక్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఖమ్మం 52 పరుగుల తేడాతో మెదక్‌ను చిత్తుచేసింది. ముందు బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం 5 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. మెదక్‌ 98 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. మూడో స్థానం కోసం మహబూబ్‌నగర్‌– మెదక్‌ జట్ల మధ్య పోటీ జరగగా మెదక్‌ అలవోకగా 5 వికెట్ల తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ 80 పరుగులు చేయగా, మెదక్‌ లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచింది.

ఫైనల్‌లో ఖమ్మం అదుర్స్‌..

ఖమ్మం– రంగారెడ్డిల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ఖమ్మం బ్యాట్స్‌మెన్‌ వీరోచితంగా బ్యాటింగ్‌ చేసి విజయంలో కీలకంగా వ్యవహరించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం జట్టు ని ర్ణీత 15 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రసన్న 81 పరుగు లు, చైతన్య 21 పరుగులు చేసి జట్టు కు శుభారంభాన్ని అందించారు. చైతన్య ఔట్‌ అయిన తర్వాత ఫస్ట్‌డౌన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన రిత్విక్‌ 54 పరుగులు కొట్టాడు. ప్రసన్న, రిత్విక్‌లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మంచి లక్ష్యాన్ని రంగారెడ్డి ముందు ఉంచారు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన రంగారెడ్డి 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి ఓటమి చెందింది.

ఫైనల్‌లో రంగారెడ్డిపై 62 పరుగుల తేడాతో ఘనవిజయం

మూడో స్థానంలో నిలిచిన మెదక్‌

గద్వాలలో ముగిసిన

ఎస్‌జీఎఫ్‌ 70వ టోర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement