మహబూబ్‌నగర్ క్రీడలు/వనపర్తి రూరల్: జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఉమ్మడి పాలమూరు నుంచి ముగ్గురు క్రీడాకారులు మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాకు చెందిన జె.పాండుతో పాటు వనపర్తి జిల్లా శేరుపల్లికి చెందిన భాస్కర్, మూలమళ్ల ఆత్మకూరు) చెందిన ఆంజనేయులు ఎంపికయ్యారు. బిహార్ రాష్ట్రం పాటలీపుత్రలో నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టులో వీరికి చోటు దక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, వనపర్తి జిల్లా అధ్యోఉడు వెంకటేశ్వర్‌రెడ్డి, చైర్మన్ పద్మజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.కురుమయ్య హర్షం వ్యక్తం చేశారు.జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభచాటి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.


