నవాబుపేట: మండలంలోని కూచూర్‌కు చెంది న రాంచంద్రయ్య తన ఫ్యామిలీ తప్పుడు ధ్రువ పత్రం సృష్టించి తన తల్లి పేరునున్న 8.34 ఎకరా ల భూమిని విరా్‌సత్ చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు వివరించారు. ఈ విషయంలో బుధ వా రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. కూచూర్‌కు చెందిన రాంచంద్రయ్య తన తల్లి నాగ మ్మ పేరున ఉన్న భూమిని తప్పుడు ధ్రువపత్రా లు సృష్టించి విరాసత్ చేసుకున్నాడు. ఈ విషయంలో అతని కుటుంబ సభ్యులు తహసీల్దార్ సురేశ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ విచారణ జరిపి రాంచంద్రయ్య సమర్పించిన ధ్రువపత్రాలు తప్పుగా సృష్టించాడని తేల్చారు. అతనిపై చీటింగ్‌తోపాటు ఫోర్జరీ కేసునమోదు చేయాలని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అతనిపై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.కాగా,రాంచంద్రయ్య నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్
గోపాల్‌పేట: మండల కేంద్రంలో బుధవారం గోపాల్‌పేటకు చెందిన రామ స్వామి సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. వివరాలిలా.. రామస్వామి బుధ వారం సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో మద్యం మత్తులో తహసీల్దార్ కా ర్యాలయం ఎదురుగా ఉన్న సెల్‌టవర్ ఎక్కాడు. దూకి చనిపోతానని కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి సెల్‌టవర్ దగ్గరికి చేరుకుని మైకులో టవర్ దిగాలని ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని గంటసేపు బతిమాలారు. సుమారు గంటన్నర తర్వాత మరో వ్యక్తి టవర్ ఎక్కి రామస్వామిని కిందకు దించాడు. అనంతరం గోపాల్‌పేట ఎస్‌ఐ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు.
బాలలపై నేరాల కట్టడికి బాధ్యత తీసుకోవాలి
పాలమూరు: సురక్షిత్ బచ్చన్ అభియాన్ కా ర్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రెండోరోజు బుధవారం జిల్లాలో పలు ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలో పోక్సో చట్టం–2012పై అవగాహ న కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ని మహాత్మా గాంధీ రోడ్ స్కూల్, జెడ్పీహెచ్‌ఎస్ రాజాపూర్, జెడ్పీహెచ్‌ఎస్ రంగారెడ్డిగూడ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మూడో అదనపు న్యాయమూర్తి ఆంజనేయులు, న్యాయమూర్తి ఇందిర హాజరై అవగాహన కల్పించారు. అలాగే నగరంలోని ఆదర్శ హైస్కూల్, మోడల్ బేసిక్ ప్రాక్టిస్ పాఠశాలలో న్యాయమూర్తి మహ్మద్ మునవార్ హాజరై అవగాహన కల్పించారు. జడ్చర్లలోని కాకతీయ హైస్కూల్‌లో ఏర్పా టు చేసిన పోక్సో చట్టంపై న్యాయమూర్తి మహ్మద్ ముదసిర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడు తూ విద్యార్థినులు, చిన్నారులు తమకు ఎదురయ్యే అనుచిత ప్రవర్తనను గుర్తించి వెంటనే భయపడకుండా తల్లిదండ్రులు లే దా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాల న్నారు. బాలలపై జరిగే లైంగిక నేరాల కట్టడిలో ప్రతిఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడం, వారిపై నేరాలు జరగకుండా నివారించడం ఎంతో కీలకం అని అభిప్రాయపడ్డారు.


