● పెటాటీఎస్ జిల్లా అధ్యక్షుడు
జగన్మోహన్గౌడ్
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా పెటాటీఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాలబాలికల సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్మోహన్గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఎస్జీఎఫ్ క్రీడల్లో ఉమ్మడి జిల్లా జట్లు రాణిస్తున్నాయని, రానున్న క్రీడాపోటీల్లో ఇదే విధంగా ఆడి విజయం సాధించాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు రాఘవేందర్, నాగరాజు, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.


