మహబూబ్‌నగర్ క్రైం: వరుసగా రెండు రోజుల్లో వేర్వేరు రెండు రైలులో బాంబు ఉందని డయల్ 100కు ఫోన్ చేసి భయాందోళనకు గురి చేసిన వ్యక్తి ని మహబూబ్‌నగర్ రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు. స్థానిక రైల్వే పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే ఎస్‌ఐ కె.రాజు కేసు వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బొల్లెం రాఘవేందర్ ప్రస్తు తం రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో నివాసం ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మొదట ఈ నెల 24న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఉండి గద్వాల రైల్వేస్టేషన్‌లో ఉన్న సంపర్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని డయల్ 100కు కాల్ చేసి చెప్పాడు. మళ్లీ ఈ నెల 26న బుద్వేల్ రైల్వేస్టేషన్‌లో నిలబడి రాత్రి 7.20 గంటల ప్రాంతంలో అశోకపురం ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని 100 డయల్ చేసి మళ్లీ చెప్పాడు. దీంతో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ మహబూబ్‌నగర్ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఈ రైలు దాదాపు 1.29 గంటలు ఆల స్యం కావడంతోపాటు ప్రయాణికులు తీవ్ర భ యాందోళనకు గురయ్యారు. దీంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ నెల 27న రాత్రి బుద్వేల్ వెళ్లడానికి మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై ఉండగా అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదే వ్యక్తి 2016లోనూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 2, 7వ ప్లాట్‌పై ఉండి రైలులో బాంబు ఉందని డయల్ 100కు ఫోన్ చేయగా రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో 2017లో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రాఘవేందర్ ఆకతాయి చేష్టల కోసం బాంబు ఉందని చెబుతూ ప్రయాణికులను ఇబ్బందుల కు గురి చేస్తుంటాడని, దీంతో అతనిపై కేసు నమో దు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.


