చట్టాలపై అవగాహన ఉండాలి : జడ్జి ఇందిర | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన ఉండాలి : జడ్జి ఇందిర

Oct 29 2026 12:36 AM | Updated on Oct 29 2026 12:36 AM

రాజాపూర్‌: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇందిర పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలను వేధించిన, ఇబ్బందులకు గురిచేసిన సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోక్సో కేసునమోదు చేస్తారన్నారు. ముఖ్యంగా బాలికలు అమాయక మాటలు నమ్మిపోసపోవద్దన్నారు. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ పేరిట ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తే తమ తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. సమాజంలో ఎన్నో కేసులు చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సయ్యద్‌ ఇబ్రహీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని అధ్యాపకులు కోరారు. పీయూలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. వివిధ యూనివర్సిటీల్లో సుమారు 1,200 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ వంటి అర్హతలున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ అధ్యాపకుల నియామక ప్రక్రియలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 30న నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి కాంట్రాక్టు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భూమయ్య, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌, సోమేశ్వర్‌, సుదర్శన్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌, రామ్మోహన్‌, ప్రభాకర్‌రెడ్డి, శ్రీలత, మృదుల తదితరులు పాల్గొన్నారు.

పత్తి క్వింటా రూ.9,060

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌ యార్డులో బుధ వారం పత్తి క్వింటా గరిష్టంగా రూ.9,060, కనిష్టంగా రూ.8,860 ధర పలికింది. అలాగే ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకం గరిష్టంగా రూ. 3,301, కనిష్టంగా రూ.2,071, మొక్కజొన్న గరిష్టంగా రూ.3,072, కనిష్టంగా రూ.2,651, ఆముదాలు గరిష్టంగా రూ.7,966, కనిష్టంగా రూ.7,825 ధరలు లభించాయి.

పెరగని హంస ధాన్యం

దేవరకద్ర: సన్నరకం ధాన్యం ఒక్క సారిగా ధరలు పెరిగిపోతుండగా దొడ్డు రకం హంస ధాన్యం ధరలు మాత్రమే పెరగకుండా నిలకడగా ఉన్నాయి. బుధవారం దేవరకద్ర మార్కెట్‌కు దాదాపు మూడు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.3,256, కనిష్టంగా రూ.2,819గా ధరలు పలికాయి. కేఎన్‌ఎమ్‌ రకం ధాన్యం గరిష్టంగా రూ.3,303, కనిష్టంగా రూ.2,869గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2109గా ఒకే ధర నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement