● పనుల్లో వేగం పెంచి
త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ ఖుష్బూగుప్తా
చిన్నచింతకుంట: భూ రీసర్వేను పకడ్బందీగా చేప ట్టి, పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నచింతకుంట మండలం సీతారాంపేట గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూ రీసర్వే పనులను పరిశీలించారు. గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించిన అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల, డ్రైనేజీలు, సీసీ రోడ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అధికారులు సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించి, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారికి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించాలన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు
వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సాగుపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పారిశుద్ధ్య లోపాలపై ఆగ్రహం
గ్రామంలో పర్యటించిన సమయంలో డ్రెయినేజీ లు, రోడ్ల వద్ద పారిశుద్ధ్య లోపాన్ని గుర్తించిన కలె క్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రా మాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విధుల్లో ని ర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.


