ఉత్సాహంగా పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడలు

Oct 29 2026 12:36 AM | Updated on Oct 29 2026 12:36 AM

● వాలీబాల్‌ విజేతలు నవాబ్‌పేట, బాలానగర్‌ జట్లు

● అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నగరంలోని మెయిన్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో జిల్లాలోని 24 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు. రెండో రోజు బుధవారం బాలబాలికలకు వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపా టు క్రీడల్లో ప్రతిభ చాటాలని కోరారు. ఇలాంటి క్రీడాపోటీలు విద్యార్థుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు. కార్యక్రమంలో టీజీపీడీ,పీఈటీ అసోసియేషన్‌ రాష్ట అధ్యక్షులు దూమర్ల నిరంజన్‌, పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, టోర్నమెంట్‌ కార్యదర్శి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

ఫలితాలు ఇలా..

వాలీబాల్‌ బాలుర విభాగంలో నవాబ్‌పేట ప్రథ మ, గండేడ్‌ ద్వితీయ, బాలికల్లో బాలానగర్‌ ప్రథ మ, గార్లపహాడ్‌ ద్వితీయస్థానాల్లో నిలిచాయి. అ థ్లెటిక్స్‌ బాలికల్లో షాట్‌ఫుట్‌లో ఎ.పవిత్ర, వి.నందిని, లాంగ్‌జంప్‌లో భానుశ్రీ, అక్షయ, డిస్కస్‌ త్రోలో జి.వర్షిణి, ఎం.అశ్విని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో, హైజంప్‌లో సుశీల ప్రథమ స్థానంలో, 800 మీటర్ల పరుగులో హేమ, అనూష, 100 మీ.లో సంజన, కావేరి, 400మీ.లో అంబిక, చంద్రకళ, 200మీ.లో దీక్షిత, ఎం.వర్షిణి, బాలుర షా ట్‌పుట్‌లో యూ.కార్తీక్‌, బి.శివకుమార్‌, లాంగ్‌జంప్‌లో హరిక్రిష్ణ, అన్వేష్‌, డిస్కస్‌త్రో పి.రాంచరణ్‌గౌడ్‌, బి.సాయితేజ, హైజంప్‌లో టి.శ్రీశైలం, వడ్ల ప్రవీణ్‌కుమార్‌, 800మీటర్ల పరుగులో విష్ణు, కేశవులు, 100మీ.లో యువరాజ్‌, వి.సచిన్‌, 400 మీ.లో సంతోష్‌కుమార్‌, అఖిల్‌, 200మీ.లో నితిన్‌, సిద్దార్థ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement