● మొలచింతపల్లి సమీపంలో అటవీ అధికారుల తనిఖీలు
కొల్లాపూర్: మండలంలోని మొ లచింతపల్లి గ్రామ సమీపంలో మోటార్‌సైకిల్‌పై సంచుల్లో తరలిస్తున్న అనుమానాస్పద జంతు మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ సిబ్బందిని గమనించిన ఇద్దరు వ్యక్తులు సంచులను రోడ్డుపక్కన ఉన్న ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఫారెస్ట్ రేంజర్ వాణికుమారి తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ అధికారులు సంచులను పరిశీలించగా అందులో జంతు మాంసం ఉన్నట్లు గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని కొల్లాపూర్ కోర్టుకు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మాంసం ఏ జంతువుదో నిర్ధారించేందుకు కొంత నమూనాను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. మిగిలిన మాంసాన్ని కాల్చివేసినట్లు ఆమె తెలిపారు. మాంసాన్ని తరలించిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో అటవీ ఉద్యోగులు కాశన్న, ముజీబ్‌ఘోరీ, మల్లేష్, శివకుమార్, నీలేష్, బయ్యన్న, నాగార్జునగౌడ్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై మొసలి కలకలం
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారి డైవర్షన్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి మొసలి సంచారం కలకలం రేపింది. మొసలిని చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్‌గౌడ్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకొని మొసలిని బంధించి.. రంగాపురం గ్రామ శివారులోని కృష్ణానదిలో వదిలిపెట్టారు.


