రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్లుగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్లుగా నిలవాలి

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలవాలని జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో నేటి (బుధవారం) నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం బయలుదేరింది. స్థానిక ఇండోర్‌ స్టేడియంలో జిల్లా జట్టును అభినందించారు. కురుమూర్తిగౌడ్‌ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని అన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో విజేతగా నిలిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాపారాయుడు, శ్రీనివాసులు, గణేష్‌, కోచ్‌ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement