పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడలు ప్రారంభం

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడాపోటీలు మంగళవారం ప్రారంభమైంది. ఈ పోటీల్లో జిల్లాలోని 24 పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి రోజు బాలబాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో గార్లపహాడ్‌ ప్రథమ, గొండ్యాల ద్వితీయ, బాలికల్లో గాజులపేట ప్రథమ, బాలానగర్‌ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. పోటీల్లో భాగంగా బుధవారం బాలబాలికలకు వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీలు జరగనున్నాయి. పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభచాటాలని కోరారు. జిల్లా విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలన్నారు. జిల్లాస్థాయిలో విజేతగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పీఎంశ్రీ పోటీల్లో ప్రతిభ చాటాలని కోరారు. కార్యక్రమంలో టోర్నమెంట్‌ ఇన్‌చార్జి వేణుగోపాల్‌, మాజీ ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్‌ శారదాబాయి, రమేష్‌బాబు, పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, పీడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement