● మహబూబ్‌నగర్‌కు శుభారంభం
● హోరాహోరీగా మ్యాచ్‌లు
గద్వాల న్యూటౌన్: జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలకు చెందిన పది జట్లు పాల్గొంటున్న ఈ పోటీలను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మంగళవారం ఇండోర్, సోమనాద్రి స్టేడియాల్లో తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. పలు జట్లు విజయాల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. నిజామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ ఎనిమిది వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ నిర్ణీత 12 ఓవర్లలో ఆరు వికెట్లకు 81 పరుగులు చేయగా.. నల్గొండ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచ్‌లో మెదక్ ఏడు పరుగుల తేడాతో ఆదిలాబాద్‌పై గెలిచింది. మెదక్ 74 పరుగులు చేయగా.. ఆదిలాబాద్ 68 పరుగులకే పరిమితమైంది.
● ఖమ్మం జట్టు కరీంనగర్‌పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఖమ్మం 114 పరుగులు చేయగా.. కరీంనగర్ 74 పరుగులకే ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో ఆదిలాబాద్ 91 పరుగులు చేయగా.. నల్లగొండ ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. మెదక్–నిజామాబాద్ మ్యాచ్‌లో నిజామాబాద్ 55 పరుగులు చేయగా.. మెదక్ లక్ష్యాన్ని ఈజీగా చేరుకొని గెలుపొందింది.
● ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వరంగల్‌పై రంగారెడ్డి గెలుపొందింది. తొలుత వరంగల్ బ్యాటింగ్ చేసి 112 పరుగులు చేయగా.. రంగారెడ్డి జట్టు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రంగారెడ్డి బ్యాటర్ రోహన్ (62 పరుగులు)అర్ధసెంచరీ చేశాడు.మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌పై వరంగల్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత వరంగల్ 12 ఓవర్లలో 80 పరుగులు చేయగా.. హైదరాబాద్ 74 పరుగులకే పరిమితమైంది. మరోమ్యాచ్‌లో కరీంనగర్‌పై ఖమ్మం విజయం సాధించింది.


