రైతులను నష్టపరిచే కలుపు మొక్క | - | Sakshi
Sakshi News home page

రైతులను నష్టపరిచే కలుపు మొక్క

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

నివారణ చర్యలు..

అలంపూర్‌: పంట ఏదైనా రైతును ముందుగా కలవరపెట్టే కలుపు మొక్క వయ్యారి భామ. దీనిని పార్ధీనియం, ముక్కుముల్లు, క్యారెట్‌ గడ్డి లేదా తిక్క అ లుము అని కుడా పిలుస్తారని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి తెలిపారు. దీని పూర్తి పేరు పార్ధీనియం హిస్టిరోఫోరస్‌. నేల ఏదైనా రైతు కు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 1960లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గో ధుమల వెంబడి ఇది మన దేశానికి చేరింది. అన తి కాలంలోనేఈ కలుపు మొక్క దేశమంతా వ్యాపించి, లక్షలాది ఎకరాల్లో పంటకు నష్టం కలిగిస్తోంది. ఈ మొక్క గురించి రైతులు అవగాహన పెంచుకోవాల ని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు.

పార్ధీనియం మొక్క వివరాలు

పార్ధీనియం మొక్క 90 రోజులు జీవిస్తోంది. 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు పెరిగి, 40 నుంచి 60 రోజుల్లో పూతకు వస్తోంది. ఒక్కొక్క మొక్క 40 వేల గింజలతో పాటు 3 వేల మిలియన్ల పుప్పొడిని ఒక్కొక్క చదరపు మీటరుకు ఉత్పత్తి చేస్తోంది. ఇది కాలంతో పని లేకుండా ఎప్పుడైనా మొలకెత్తుతుంది. పంట పొలాల్లో గట్ల వెంట, రోడ్ల పక్కన, కాల్వల వద్ద ఎక్కడైనా ఇట్టే మొలకెత్తుతుంది. పంటలు లేని పొలాల్లో దీని ఉధృతి మరి ఎక్కువగా ఉంటుంది.

ఏం చేస్తోంది..

వయ్యారి భామ మొక్క అనేక అనారోగ్య సమస్యలు కలుగజేస్తోంది.వీటిని చేతులతో తొలగించి న, తాకినా, తగలబెట్టే సమయంలో దగ్గరగా ఉంటే దురుద వస్తోంది. దీని యొక్క పూ లలో పార్ధీన్‌ అనే విషకారకం ఉండటం వలన శ్వాసకోస సంబంధమై న వ్యాధులు, అలర్జీ, ఎగ్జిమా, చర్మ సంబంధి త వ్యాధులు వ్యాపిస్తాయి.ఈ పార్ధీనిన్‌ మొక్క లలో ఫ లదీకరణ జరగకుండా అడ్డుకుంటుంది. పశువులు, మేకలు దీన్ని తింటే రక్త విరోచనాలు అవుతాయి.

పంటలకు నష్టం

ఈ మొక్క యొక్క పూలు వైరస్‌ క్రిములకు ఆశ్రయం ఇస్తాయి. పంటలు లేని సమయంలో ఈ వైరస్‌ క్రిములు పార్ధీనియం పూలలో స్థావరం ఏర్పర్చుకుంటాయి. పంట కాలంలో తెల్ల దోమ, తామర పురుగులు, పేను బంక, పచ్చ దోమ పురుగులు ఈ పూల నుంచి వైరస్‌ను పంటలకు వ్యాప్తి చేస్తాయి. పంటలకు వచ్చే వైరస్‌ తెగుళ్లు బడ్‌ నెక్రోసిస్‌, జెమిని వైరస్‌, కుకుంబర్‌ మొజాయిక్‌ వైరస్‌, మొవ్వ కుళ్లు వైరస్‌ దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ కలుపు మొక్క నీరు, పోషకాలు, స్థలం కోసం పంటలతో పోటిపడి పెరుగుతాయి. దీని వలన 40 శాతం దిగుబడి తగ్గుతుంది.

పంటలను, మనుషుల ఆరోగ్యాన్ని నష్టపరిచే వయ్యారి భామను ఎవరూ నివారించలేరు. రైతులు అందరూ సాముహికంగా ఒకే రోజు మొక్కల నివారణకు కలిసి రావాలి. దీని నివారణకు 50 గ్రాములు ఉప్పును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే పూత రాకుండా ఆగుతుంది. చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు గ్‌లైఫోసేట్‌ 10 మిల్లీ లీటర్లు, 10 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కలపై పారాక్వాట్‌ అనే మందును 5 మి.లీ లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మొక్క పూత రాకముందే నివారిస్తే రైతులకు ప్రయోజనం. పూత వచ్చిన తర్వాత విత్తనాలు నేలపై పడి మళ్లీ మొలకెత్తుతాయి.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement