విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

అయిజ: విద్యుదాఘాతంతో ఇంటర్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన అయిజ మున్సిపాలిటీలోని పర్దీపురంలో మంగళవారం చో టు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పర్దీపురం గ్రామానికి చెందిన చిన్న ఈరన్నగౌడ్‌, జములమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం (ఓపెన్‌ యూనివర్సిటీ) చదువుతున్న వారి కుమారుడు ఉపేందర్‌గౌడ్‌ (17) వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం వ్యవసాయ పొలంలో నీరుపారించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాల్వలో ఏర్పాటుచేసుకున్న విద్యుత్‌ మోటార్‌ను ఆన్‌ చేస్తుండగా.. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఒక్కగానొక కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

తిమ్మాజిపేట: మండల పరిధిలోని మరికల్‌ గ్రామానికి చెందిన హన్మన్‌గళ్ల బాల్‌రాజ్‌ (24) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 23న బాల్‌రాజ్‌ జడ్చర్ల నుంచి స్వగ్రామమైన మరికల్‌కు బైక్‌పై వేగంగా వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తలకు, ఎడమ భుజానికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పురుగు మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

పెద్దకొత్తపల్లి: పురుగు మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘ టన పెద్దకొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌ వివరాల మే రకు.. మండలంలోని గంట్రావుపల్లికి చెందిన పెద్దముక్కల రాములు కు టుంబంతో కలిసి హైదరాబాద్‌లో కూలీ పను లు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగకు అతడి కూతురు పెద్దముక్కల గీత (16) తన అమ్మమ్మగారి ఊరైన ముష్టిపల్లికి వచ్చింది. సోమవారం రాత్రి పురుగు మందు తాగిన బాలిక.. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు గీత కల్వకుర్తి కస్తూర్బాగాంధీ గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

జడ్చర్ల: స్థానిక శ్రీనివాస సినిమా థియేటర్‌ వె నుక ఉన్న మురుగు కాల్వలో మంగళవారం గు ర్తు తెలియని వ్యక్తి (సుమారు 45) మృతదేహా న్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ జయప్రసాద్‌ తెలిపారు. మృతుడు చెక్స్‌ షర్టు లోపల ఎరుపు టీషర్టు, నీలిరంగు ప్యాంటు, నల్లటి చెప్పులు ధరించి ఉన్నాడని, గడ్డం, మీసాలు ఉన్నాయని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement