కోయిల్‌సాగర్‌ పర్యాటక అభివృద్ధికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కోయిల్‌సాగర్‌ పర్యాటక అభివృద్ధికి స్థల పరిశీలన

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

● రూ.10 కోట్లతో పర్యాటక

వసతుల కల్పనకు కసరత్తు

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు మరోసా రి భూములను పరిశీలించారు. మంగళవారం ప్రా జెక్టు సమీపంలోని గెస్ట్‌హౌస్‌ వద్ద ఉన్న గుట్ట ప్రాంతాన్ని డీఆర్వో నిర్మల, డీటీ దీపికతో పాటు జిల్లా నుంచి వచ్చిన అధికారుల బృందం పరిశీలించింది. కోయిల్‌సాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గతంలో ప్రభుత్వం రూ.10 కోట్ల నిధు లు మంజూరు చేసింది. అయితే పర్యాటక అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాలను ఖరారు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో తుది నివేదిక సమర్పించేందుకు అధికారు లు అందుబాటులో ఉన్న భూములను పరిశీలించా రు. హరిత హోటల్‌, పర్యాటకుల బస కోసం గెస్ట్‌హౌస్‌లు, పిల్లల పార్కు, ఇతర భవనాల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు.

స్థలాల ఖరారుపై దృష్టి

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా పర్యాటక అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, పర్యాటక శాఖ అధికారులతో కలిసి చేపట్టాల్సిన పనులపై చర్చించి, వివిధ నిర్మాణాలకు స్థలాలను సూచించారు. అయితే స్థలాల కేటాయింపు ఖరారు కాకపోవడంతో అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శరత్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement