చిన్నచింతకుంట: తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమైన అమ్మాపురం కురుమూర్తి స్వామివారి బ్ర హ్మోత్సవాలకు వేలైంది. వచ్చే నెల 10 నుంచి స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందు లో భాగంగా ఆలయం వద్ద పారిశుద్ధ్య, తాగునీటి వసతి, రంగులు అద్దడం, ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించడం వంటి పనులు చేపట్టారు. ఇప్పటికే స్వా మివారి ప్రధాన ఆలయం, మెట్లు, క్యూలైన్ రాడ్లు, రోడ్డుపైన ఉన్న కమాన్లు, అన్నదాన సత్రం తదితర వాటికి రంగులు అద్దుతున్నారు. అలాగే మెట్ల పక్కనున్న రాజగోపురం వద్ద ఉన్న ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు.


