మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ సెక్రటరీ వేణుగోపాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 24 పీఎంశ్రీ పాఠశాలలకు సంబంధించి ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. నేడు కబడ్డీ, 28న వాలీబాల్, అథ్లెటిక్స్, 29న ఖోఖో పోటీలు ఉంటాయని వివరించారు. కేవలం విజేత జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఈ క్రీడలకు సంబంధించి అధ్యక్షురాలిగా డీఈఓ, కన్వీనర్‌గా ఏఎంఓ, కోకన్వీనర్‌గా అర్బన్ ఎంఈఓ వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.
వైభవంగా సంకీర్తన
వారోత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: శ్రీఅన్నమయ్యవాణి లలితా సంగీత విద్యాలయం వ్యవస్థాపకుడు గద్వాల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో నగరంలోని గాయత్రీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న శ్రీవనమాలి పాదపద కవితా తాతసంకీర్తన షష్టమ వారోత్సవాలు నాలుగో రోజు సోమవా రం వైభవంగా కొనసాగుతన్నాయి. ఈ సందర్భంగా గద్వాల చంద్రశేఖరరావు నిర్వహించిన సంకీర్తన కచేరీ అద్యంతం అలరించింది. పలు అన్నమయ్య భక్తి గీతాలను ఆలపించారు. సంకీర్తనవారోత్సవాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించకుంది. ఈనెల 29వ తేదీ వరకు సంకీర్తన షష్టమ వారోత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమంలో సామవేదం వెంకటమురళీకృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సీజన్ ప్రారంభం
దేవరకద్ర/జడ్చర్ల: దేవరకద్ర మార్కెట్‌లో వడ్ల సీజన్ ప్రారంభమైంది. వానాకాలం కింద వేసిన వరి పంటలు కోతలు కోస్తుండడంతో రైతులు పంట మార్పిడి తరువాత నేరుగా మార్కెట్‌కు అమ్మకానికి తెస్తున్నారు. సోమవారం మార్కెట్‌కు దాదాపు 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. తేమ శాతం అధికంగా ఉన్నా ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఎక్కువ వస్తుండడంతో రైతులు కోతలు కోసిన వెంటనే మార్కెట్‌కు వడ్లను అమ్మకానికి తెస్తున్నారు. టెండర్ల తరువాత కెఎన్‌ఎమ్ రకం వడ్లకు గరిష్ట ధర రూ.3,401, కనిష్ట ధర రూ.3,101గా ధరలు లభించాయి. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర గరిష్టంగా రూ.3,114గా ఒకే ధర నమోదైంది.
● బాదేపల్లి మార్కెట్‌లో ధాన్యనికి రికార్డుస్థాయిలో ధర పలికింది. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.3,686, కనిష్టంగా రూ.2,222 ధరలు లభించాయి. మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,971, కనిష్టంగా రూ.2,309, వేరుశనగ రూ.7,200, ఆమదాలు రూ.7,878 ధరలు లభించాయి.


