పాలమూరు: నూతనంగా ఏర్పాటు చేయనున్న నాలుగు బార్లను శుక్రవారం కలెక్టరేట్‌లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో ఒకటి, దేవరకద్రలో ఒకటి, మక్తల్‌లో ఒకటి, మద్దూర్‌లో ఒక బార్‌కు టెండర్లు స్వీకరించగా.. మహబూబ్‌నగర్‌కు 78 టెండర్లు, దేవరకద్రకు 90, మక్తల్‌కు 38, మద్దూర్‌కు 58 టెండర్లు వేశారు. నాలుగు బార్లకు కలిపి 264 టెండర్లు రాగా.. ప్రభుత్వానికి రూ.2.64 కోట్ల ఆదాయం సమకూరింది. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా లక్కీడిప్ తీయగా మహబూబ్‌నగర్ బార్ దరఖాస్తు నంబర్ 34 కలిగిన కొమ్ము రాజయ్య, దేవరకద్ర 53వ దరఖాస్తుదారుడు నగేష్ దక్కించున్నారు. నారాయణపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీను లక్కీడిప్ తీయగా.. మక్తల్ దరఖాస్తు నంబర్ 37 ఉన్న మధుబాబు, మద్దూర్ దరఖాస్తు నంబర్ 58 కలిగిన రవితేజ బార్లు సొంతం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో బార్‌కు రూ.40 లక్షలు, దేవరకద్ర మున్సిపాలిటీకి రూ.32 లక్షలుగా నిర్ణయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, శిక్షణ కలెక్టర్ సాయి శివాణి, ఎకై ్సజ్ అసిస్టేంట్ కమిషనర్ శ్రీనివాస్, ఈఎస్ సుధాకర్, సీఐ వెంకటేశం పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రూ.2.64 కోట్ల ఆదాయం


