పాలమూరు: ఛాతీ, ఊపిరితిత్తుల వైద్యరంగంలో పరిశోధనలకు గుర్తింపుగా మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ తుమ్మూరు వెంకటేశ్వర్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక భారత థోరాసిక్ ఎండోస్కోపీ సొసైటీ ఫెలోషిప్ అవార్డు లభించింది. శనివారం నోయిడాలో జరిగిన జాతీయ సదస్సులో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తదితర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపికై న ఎనిమిది మంది వైద్యుల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎంపికై న ఏకై క వైద్యుడు వెంకటేశ్వర్‌రెడ్డి కావడం విశేషం. ఛాతీ, ఊపిరితిత్తుల వైద్య విభాగంలో ఆయన చేసిన పరిశోధనలు, అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఎస్‌వీఎస్ ఆస్పత్రి యాజమాన్యం, కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డిని అభినందించారు.
పోక్సో కేసు నమోదు
తిమ్మాజిపేట: మండలంలోని మారేపల్లికి చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైనట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఓ గ్రామానికి చెందిన బాలికను వివాహం చేసుకొంటానని న మ్మించి తీరా పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదైందన్నారు. సదరు యువకుడితో పెళ్లి చేయా లని కొన్నిరోజులుగా బాలిక కొందరు గ్రామస్తులను వేడుకున్నట్లు తెలిసింది. అయితే ఇటీవల షీటీంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


