బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

Oct 9 2026 1:08 AM | Updated on Oct 9 2026 1:08 AM

● వివిధ రాష్ట్రాల క్రీడాకారులు హాజరు

● గెలుపోటములను సమానంగా

స్వీకరించాలి

● ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి, క్రీడాస్ఫూర్తిని చా టాలని ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని జయప్రకాశ్‌ నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో నాలుగు రోజులపాటు కొనసాగే జాతీయస్థాయి సీనియర్‌ పురుషుల ఓపెన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. ఓడిన వారు నిరాశచెందకుండా మళ్లీ గెలుపు కోసం పట్టు దలతో ఆడాలని సూచించారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులు ఖర్చుపెడుతున్నాయని పేర్కొన్నారు. ఆధునిక మైదానాలు, మౌలిక వసతులు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఈ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

మొదటి రోజు ఫలితాలు

బాక్సింగ్‌ పోటీల్లో మొదటిరోజు జరిగిన పలు మ్యాచుల్లో ఆయా రాష్ట్రాల క్రీడాకారులు గెలుపొందారు. ప్రీ–1 ఫలితాల్లో 54 కేజీల విభాగంలో మయాంక్‌ చత్రి (జార్ఖండ్‌), 67 కేజీల విభాగంలో దిండిటి ధర్మతేజ (ఆంధ్రప్రదేశ్‌), 67 కేజీల విభాగంలో శ్యామ్‌సింగ్‌ (అరుణాచల్‌ప్రదేశ్‌), 67 కేజీల విభాగంలో ప్రియాంష్షుసింగ్‌ (చండీఘర్‌), 67 కేజీ విభాగంలో సుఖ్‌దేవ్‌ (ఢిల్లీ), 67 కేజీ విభాగంలో ఆతిష్‌ (జమ్ముకాశ్మీర్‌), 75 కేజీలో నీరజ్‌ గణేష్‌ (జమ్ముకాశ్మీర్‌) విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement