ఉప్పునుంతల: మండలంలోని వెల్టూరులో గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎడ్ల నిరంజన్ (45) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. స్థానిక పాఠశాల పక్కనే వ్యవసాయ మోటర్లకు కరెంట్ సరఫరా అయ్యే 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. అదే దిమ్మైపె కొన్నేళ్ల క్రితం గ్రామంలో ని కొన్ని కాలనీలకు కరెంట్ సరఫరా కోసం సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ (బుడ్డి) పెట్టారు. ఇటీవల విద్యుత్ లోఓల్టేజీ సమస్య తలెత్తడంతో అక్కడే మరో సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ (బుడ్డి)ను పెట్టడానికి తీసుకొచ్చారు. ట్రాక్టర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ బుడ్డిని వేసుకొని ఇతర సిబ్బందితో కలిసి నిరంజన్ అక్కడికి వెళ్లాడు. కరెంట్ సరఫరాను నిలిపేయడానికి ఎల్‌సీ తీ సుకోకుండానే ట్రాక్టర్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను దిమ్మైపె పెట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దిమ్మైపె ఇంతకు ముందున్న ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన కరెంట్ వైరు తగలడంతో నిరంజన్ విద్యుదాఘాతానికి గరయ్యా డు. చికిత్స నిమిత్తం మొదటి డిండికి అటునుంచి వెల్దండ సమీపంలోని యెన్నం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయా డు. అనంతరం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు నిరంజన్‌కు భార్య జంగమ్మతోపాటు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
విద్యుత్‌షాక్‌తో
వ్యవసాయ కూలీ మృతి
కోస్గి రూరల్: వేరుశనగ పంటకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని మీర్జాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మీర్జాపూర్‌కు చెందిన అప్పలికొడుకు అప్పయ్య (50) తూర్పు వెంకటేశ్వర్‌రెడ్డి వద్ద వ్యసాయ పనుల నిమిత్తం జీతంలో చేరాడు. వేరుశనగ పంటకు అడవి పందుల దాడి నుంచి రక్షణ నిమిత్తం విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే పంటలోకి వెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. గమనించిన పక్క పోలం వారు యజమానికి సమాచారం అందించారు. కుటంబ సభ్యులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్ అదుపుతప్పి
మహిళా కూలీ దుర్మరణం
మాగనూర్: మాగనూర్ పోలీస్టేషన్ పరిధిలోని ఓబ్లాపూర్ గేట్ సమీపంలో బుధవారం సా యంత్రం బైక్ అదుపుతప్పి భవన నిర్మాణ కార్మికురాలు మృతిచెందినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గుడేబల్లూరుకు చెందిన రాయిచూర్ లక్ష్మి(46), భర్త లక్ష్మణ్ కలిసి మక్తల్‌కు కూలీ పనుల నిమి త్తం వెళ్లారు. సాయంత్రం తమ బైక్‌పై ఇంటికి వస్తుండగా.. ఓబ్లాపూర్ గేట్ సమీపంలో అకస్మాత్తుగా కుక్క అడ్డం రావడంతో బైక్ అతివేగంగా నడపడం వల్ల అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో గాయపడిన రాయిచూర్ లక్ష్మి తలకు తీవ్ర రక్తగాయమైంది. స్థానికులు అంబులెన్స్‌లో మక్తల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడు రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాహిత బలవన్మరణం
ఉండవెల్లి: కుటుంబ కలహాల కారణంగా వివాహిత మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్ వివరాల ప్రకారం మండలంలోని బొంకూరు గ్రామానికి చెందిన షేక్షావళి, షకీలా దంపతులు గొడవ పడ్డారు. భార్య షకీలా(26) మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎంతకీ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు విరగొట్టి చూ డగా అప్పటికే ఉరేసుకొని వేలాడుతూ కన్పించగా ఆమెను కిందకు దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి కాశీంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఒకరికి రెండు
కుల పత్రాలు
● పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
రాంగోపాల్‌పేట్: ఒకే మహిళ రెండు వేర్వేరు కులధ్రువీరణ పత్రాలు పొందడంపై రాంగోపాల్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన బాలరాజు అనే వ్యక్తి 2020లో ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి బీసీ–బీ కురుమ కుల ధ్రువీకరణ ప త్రం పొందాడు. అయితే ఆయన కుమార్తె శ్రీని త పేరు మీద యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్నట్లు సికింద్రాబాద్ ఆర్డీఓ ద్వారా మాదాసి కుర్వ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని 2022లో పొందారు. దీనిపై ఆత్మకూరుకు చెందిన కొంత మంది ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై స్థానిక పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయం నుంచి తప్పుడు కులధ్రువీరణ పత్రం పొందారని తేలడంతో ఆత్మకూరు తహసీల్దార్ షేక్ చాంద్‌పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాంగోపాల్‌పేట్ పోలీసులు శ్రీనిత ఆమె తండ్రి బాలరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


