నవాబుపేట: రెక్కాడితే కాని డొ క్కాడని కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం వీధిన పడేసిందని, మృతురాలి ఇద్దరు పిల్లలు తల్లి లేని వారయ్యారని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ రోడ్డు ప్రమాద మృతురాలు బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి నవాబుపేట–మహబూబ్‌నగర్ రోడ్డులో ఆటో, కారు ఢీకొని కాకర్లపహాడ్‌క చెందిన గొర్ల సరిత(36) మృతిచెందిన విష యం విధితమే.. అయితే మృతదేహానికి గురువా రం పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు ప్రా రంభిస్తూ నేరుగా కాకర్లపహాడ్ గేట్ వద్ద రోడ్డుపై మృతదేహంతో ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు నవాబుపేట– మహబూబ్‌నగర్ రహదారి లో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆందోళన మరింత ఉధృతంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్న హామీ లభించేదాకా ఆందోళన విరమించేది లేదంటూ బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. మృతదేహంతోపాటు రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు.
ఎస్‌ఐ జోక్యంతో ఆందోళన విరమణ
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గొర్ల సరిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఎస్‌ఐ నరేందర్ బాధితులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని.. తన పరిధిలో ఉన్నంత వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. ఆందోళనలో కాకర్లపహాడ్ సర్పంచ్ బాలయ్య, నరేందర్, మాదవులు, అంబేడ్కర్, గోపాల్, సుభాన్ తదితరులతోపాటు మృతురాలి బందువులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని
ఆదుకోవాలని డిమాండ్
కాకర్లపహాడ్ గేట్‌పై బంధువులు, గ్రామస్తుల ఆందోళన
కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు,
పోలీసుల హామీతో విరమణ


