ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

● మహిళ మృతి, నలుగురికి తీవ్రగాయాలు

వనపర్తి రూరల్‌: అతివేగంతో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణంలోని 9 వార్డు జంగాల గుట్ట కాలనీకి చెందిన రమేష్‌, వనజ దంపతులతో పాటు 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి ట్రాలీ ఆటోలో మంగళవారం ఉదయం శ్రీరంగాపురం మండలంలోని శేరుపల్లి జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలు దేరారు. మార్గమధ్యలో పెద్దగూడెంతండా వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వనజ (40) అక్కడిక్కడే మృతి చెందింది. నలుగురికి తీవ్ర, ఐదుగురికి గాయాలు కావడంతో క్షత్రుగాత్రులను 108 అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో సుహాసిని, నందకిశోర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. రమేష్‌, మహేందర్‌, మీనాక్షి, అక్షయ, లావణ్య, శంకర్‌, నారాయణమ్మ వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హృశికేష్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. బాధితుడు రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ హృశికేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement