నేటినుంచి జంగల్‌ సఫారీ షురూ | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి జంగల్‌ సఫారీ షురూ

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

మన్ననూర్‌: అమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యంలో గత కొంత కాలంగా నిర్వాహణలో ఉన్న జంగల్‌ సఫారీ నేడు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పునః ప్రారంభమవుతుందని డీఎఫ్‌ఓ రేవంత్‌ చంద్ర ఆదేశాల మేరకు మన్ననూర్‌ ఎఫ్‌ఆర్‌ఓ సవిత తెలిపారు. వన్యప్రాణుల బ్రీడింగ్‌ సమ యమైనందున వాటి స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని మూడు నెలలు గా సఫారీ మూసి ఉంచడంతోపాటు అటవీ ప్రాంతంలో ఎలాంటి జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్న సంగతి విధితమే. అక్టోబర్‌ 1వ తేదీ మొదలు కొని ప్రతినిత్యం సఫారీ వాహనాలు సంబంధిత అటవీ శాఖ అధికారులు నిర్ధేశించిన ప్రాంతాల్లో ప్రకృతి ప్రియులు, వన్యప్రాణుల ప్రేమికుల కోసం సిద్ధంగా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకులు సఫారీలో ఉన్న క్రమంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రతి వాహనం వెంట అనుభవజ్ఞలైన నేచర్‌ గైడ్స్‌ ఒకరు అందుబాటులో ఉండి వన్యప్రాణులు, అరుదైన వృక్షజాలం గురించి వివరిస్తుంటారని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అడవులు ఆకుపచ్చ రంగులో ఆహ్లాదంగా ఉండటంతోపాటు అధిక మొత్తంలో పెరిగిన వన్య ప్రాణులు ము ఖ్యంగా పెద్దపులులు దారిలో కనిపించి సఫారీ ట్రిప్‌ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునేదిగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫరహాబాద్‌, గుండం, అక్కమ్మదేవి గుహలు వంటి అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలో సఫారీ ప్రయాణం కొనసాగుతుందన్నారు. సఫారీ వేళ లు ఉదయం 9గంటల నుంచి సాయింత్రం 4గంటల వరకు ఉంటుంది. ప్రయాణం చేయాలనుకునే పర్యాటక ప్రియులు htt pr: //amrabadtigerreserve.com/ వెబ్‌సెట్‌ను సంప్రదించాలని సూచించారు. సఫారీ ట్రిప్‌లో ఉన్న పర్యాటకులు ప్లాస్టిక్‌, చెత్త చెదారం అటవీ ప్రాంతంలో వేయరాదని, అదేవిధంగా వన్యప్రాణులకు ఎలాంటి ఆహారం అందిచకుండా ఏకో టూరిజం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement