మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కలెక్టరేట్‌లో పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరును ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్పీకర్‌గా భూమిక, ప్రధానమంత్రిగా కీర్తన, ప్రతిపక్ష నాయకురాలిగా ప్రవళిక వ్యవహరించగా.. పలువురు విద్యార్థులు మంత్రులు, ఎంపీల పాత్రలను పోషించారు. ఈ సందర్భంగా డీఈఓ విజయకుమారి మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులు మాక్ పార్లమెంట్‌లో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పన విధానం, సభా నిర్వహణపై అవగాహన పెంపొందుతుందన్నారు. నాయకత్వ లక్షణాలను అలవర్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.


