రెవెన్యూ భూములకు సంబంధించి 1954–55 భూ రికార్డులను ప్రామాణికంగా పరిగణించాలని ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయాన్ని కాలనీ వాసులు గుర్తుచేస్తున్నారు. కాస్రా, చెస్సాలా పహాణీల్లో సర్వే నంబర్ 160/పి పట్టా భూమిగా నమోదై ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. అయినా తమ భూమిని దేవాదాయ శాఖ భూముల జాబితాలో చేర్చడం వల్ల అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ అధికారులు జారీ చేసిన కాస్రా, చెస్సాలా పహాణీలు


