రోజురోజుకూ బాధ్యతలు పెరుగుతున్నాయి | - | Sakshi
Sakshi News home page

రోజురోజుకూ బాధ్యతలు పెరుగుతున్నాయి

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

60 ఏళ్లు దాటాక ఇంట్లో ఖాళీగా ఉండకుండా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాం. ఇప్పుడు బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. 25 మంది సభ్యులతో ప్రారంభమైన ఫోరం ప్రస్తుతం 1,600 మందికి చేరింది. వృద్ధులకు సమస్య వచ్చినప్పుడు అవసరమైన సలహాలు అందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఒంటరిగా ఉన్న వృద్ధులకు అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నాం. కొద్దిరోజులుగా ప్రతి ఆదివారం కొందరి ఇళ్లకు వెళ్లి వారితో సమయం గడుపుతూ ఒంటరితనం లేకుండా చూస్తున్నాం.

– జగపతిరావు, అధ్యక్షుడు, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, మహబూబ్‌నగర్‌

నంబరులోనే వృద్ధాప్యం.. మనసుకు కాదు

వృద్ధాప్యం అనేది నంబర్లలో చెప్పుకోటానికే.. మనసుకు కాదు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలన్నదే మా లక్ష్యం. అందుకోసం ఆరోగ్య కమిటీ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. సామాజిక సేవతోపాటు అధికారుల సహకారంతో కౌన్సిలింగ్‌ ఇస్తూ కుటుంబాల్లో కలతలను తగ్గిస్తున్నాం. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నాం. మా లాంటి వారిలో నూతనోత్సాహం కలిగేలా ఫోరం ముందుకు సాగుతోంది.

– నయీమోద్దిన్‌, అధ్యక్షుడు, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, జడ్చర్ల

అన్ని పట్టణాల్లో ‘అంతిమ ఆరాధన’

వయసు భారం తెలియకుండా ఉత్సాహంగా దినచర్య గడిపేందుకు ఆత్మీయ మిత్రమండలి ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటివరకు అనేక సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాం. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘అంతిమ ఆరాధన’ పేరుతో అన్నదానం చేస్తున్నాం. ఇప్పటికే 87 కుటుంబాలకు అండగా నిలిచాం. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అక్టోబర్‌ 22న పండగ సాయన్న నాటకాన్ని రవీంద్రభారతిలో ప్రదర్శించేందుకు అనుమతి లభించింది.

– బి.శివకుమార్‌, ఆత్మీయ మిత్రమండలి అధ్యక్షుడు

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement