పచ్చజొన్న క్వింటా రూ.8,500 | - | Sakshi
Sakshi News home page

పచ్చజొన్న క్వింటా రూ.8,500

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం పచ్చజొన్నల వ్యాపారం జోరుగా సాగింది. అలాగే ఉల్లి వ్యాపారం కూడా ఊపందుకుంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్న కొనుగోలుదారులు ఎగబడి కొనడానికి ముందుకొచ్చారు. సీజన్‌లో మాత్రమే వచ్చే పచ్చజొన్నలను కొనడానికి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వానకాలం సీజన్‌ కింద మెట్ట పంటగా వర్షాలతో పండించిన పచ్చజొన్నలు మార్కెట్‌కు రావడంతో వినియోగదారులు కొనుగోళ్లు ప్రారంభించారు. ఎలాంటి వేలం లేకుండానే వ్యాపారం సాగింది. రైతులే ధరలు నిర్ణయించి విక్రయించారు. నాణ్యమైన పచ్చజొన్నలు క్వింటా ధర రూ.8500లు పలికింది. 50 కేజీ బస్తా రూ.4,300లకు విక్రయించారు. ఇక కనిష్టంగా రూ.6,500లు పలుకగా 50కేజీల బస్తా ధర రూ.3,300లకు విక్రయించారు. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ఽపచ్చజొన్నలు అమ్మకానికి రాగా కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్మకాలు జరిగాయి.

ఉల్లికి తగ్గని డిమాండ్‌

దేవరకద్ర మార్కెట్‌కు కొత్త ఉల్లి అమ్మకానికి వచ్చిన డిమాండ్‌ మాత్రం తగ్గలేదు. దాదాపు వేయి బస్తాల వరకు వచ్చిన ఉల్లిని చిరు వ్యాపారులు, వినియోగదారులు పోటీపడి కొనుగోలు చేశారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.6000, కనిష్టంగా రూ.4000 వరకు పలికింది. మధ్యస్తంగా రూ.5వేల వరకు లవాదేవీలు జరిగాయి. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.3000, కనిష్టంగా రూ.2వేల వరకు అమ్మకాలు సాగాయి. మధ్యస్తంగా రూ.2500వరకు బస్తా విక్రయించారు. మార్కెట్‌లో బుధవారం లావాదేవీలతో కళకళలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement