రక్తదానం చేసి ప్రాణదాతలు కండి | - | Sakshi
Sakshi News home page

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

–పీయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రక్తదాన, మెడికల్‌ క్యాంప్‌లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ సూచించారు. ఈమేరకు పీయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన, మెడికల్‌ క్యాంప్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రక్తదానంతో పాటు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని, విద్యార్థులు మెడికల్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు 80 మందికిపైగా విద్యార్థులు రక్తదానం చేయగా వారిని వీసీ, రిజిస్ట్రార్‌లు అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్‌ ఈశ్వర్‌కుమార్‌, కృష్ణయ్య, ప్రోగ్రాం అధికారులు రవికుమార్‌, అర్జున్‌కుమార్‌, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement