మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన సూచించారు. ఎదిర జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌కు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి, వారి ప్రతిభను తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల ద్వారా రక్త గ్రూప్ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ వినియోగం వల్ల సమయం వృథా కావడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి విషయాలను ప్రోత్సహించాలని సూచించారు. జీవితంలో మంచి మార్గంలో నడిచిన వారికి దీర్ఘకాలంలో మంచి ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయకుమారి, ఏఎంఓ శ్రీనివాస్, బీసీ గురుకుల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
● తెలంగాణ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన


