బాలుడిపై కుక్క దాడి | - | Sakshi
Sakshi News home page

బాలుడిపై కుక్క దాడి

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

● నుదుటిపై 21 కుట్లు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

దేవరకద్ర రూరల్‌: ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై వీధికుక్క ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు గణేష్‌(5) ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని కుక్కను తరిమేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడిలో గాయపడిన గణేష్‌ను కుటుంబసభ్యులు తొలుత మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు నుదుటిపై సుమారు 21 కుట్లు వేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

నాగారంలో కుక్కల బెడద

నాగారం గ్రామంలో గత నాలుగైదు నెలలుగా వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని గ్రామ సు ్థలు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కుక్కల ను తీసుకొచ్చి గ్రామ శివారులో వదిలి వెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 70 నుంచి 100 వరకు వీధికుక్కలు ఉన్నాయని, వాటిలో కొన్ని అనారోగ్య లక్షణాలతో కనిపిస్తున్నాయని తెలిపారు. బాలుడిపై దాడి చేసిన కుక్క అంతకుముందు ఓ రైతుకు చెందిన మేకను కూడా కరిచిందని పేర్కొన్నారు. మరో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి దాడి చేసిన కుక్కను పట్టుకోవడంతో పాటు వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

చికిత్స పొందుతున్న బాలుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement