స్థానికంగా కలకలం.. | - | Sakshi
Sakshi News home page

స్థానికంగా కలకలం..

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

ఊట్కూర్‌ మండలం నిడుగుర్తి–లక్ష్మిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో కృష్ణజింకను వేటాడినట్లు విచారణలో తేలడంతో స్థానికంగా కలకలం రేగింది. సోమవారం నారాయణపేట అటవీశాఖ అధికారులు, షాద్‌నగర్‌ పోలీసులు కలిసి వేట జరిగినట్లు అనుమానిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. జింకను ఎక్కడ కాల్చారు? ఎక్కడ మృతదేహాన్ని ముక్కలు చేశారు? మాంసాన్ని ఎలా తరలించారు? కళేబరానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా? అనే కోణాల్లో ఆరా తీశారు. అనుమానిత ప్రదేశంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించిన అనంతరం అధికారులు షాద్‌నగర్‌కు వెళ్లినట్లు తెలిసింది.

● ఈ కేసులో ఊట్కూర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని బండమీది గేరికి చెందిన రియాజ్‌ పేరు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికి ఈ ప్రాంతంలో కృష్ణజింకల సంచారం ఎలా తెలిసింది? వేట జరిగిన ప్రదేశాన్ని ఎవరు చూపించారు? స్థానికంగా ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. వేటలో పాల్గొన్న వారి పాత్ర, స్థానికంగా అందిన సహకారంపై పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement